google-site-verification=UWT1HvOXuoHYc3pTHYovgRemmW317tUEVMirkVYs_Ks google-site-verification=UWT1HvOXuoHYc3pTHYovgRemmW317tUEVMirkVYs_Ks
top of page

ఇందిరమ్మ ఇండ్ల కు లైన్ క్లియర్.....

Nov 2

2 min read

0

1

0

* ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నా కూడా త‌ల తాక‌ట్టు పెట్ట‌యినా స‌రే ఇందిర‌మ్మ ఇండ్ల‌ను పూర్తిచేస్తాం

* ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణం మా ప్ర‌భుత్వానికి చాలా ప్రతిష్టాత్మకం

* మీడియాతో మంత్రి శ్రీ పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి చిట్ చాట్


రాష్ట్రంలో ఈనెల 5, 6 తేదీల నుంచి ఇందిర‌మ్మ ఇండ్ల ల‌బ్ధిదారుల ఎంపిక‌.

15 రోజుల్లో గ్రామ క‌మిటీల ద్వారా ఎంపిక పూర్తి చేసి ఆ వెంట‌నే జాబితాల ఖ‌రారు. ఇది నిరంత‌ర ప్ర‌క్రియ‌.

గ్రామాల‌లో ఇందిర‌మ్మ క‌మిటీల ఎంపికే ఫైన‌ల్‌.

ఇండ్లు మ‌హిళ‌ల పేరిటే మంజూరు. ల‌బ్దిదారులే సొంతంగా ఇండ్లు నిర్మించుకునే అవ‌కాశం క‌ల్పిస్తున్నాం.

ఎటువంటి రాజ‌కీయ జోక్యం ఉండ‌దు. నిరుపేద‌లకు తొలి ప్రాధాన్యత‌.

పేద‌రిక‌మే ప్రామాణికంగా ల‌బ్దిదారుల ఎంపిక‌.

ల‌బ్దిదారుల ఎంపిక‌లో ప్ర‌త్యేక యాప్ దే కీల‌క‌పాత్ర‌, అందుకే ఇంత స‌మ‌యం ప‌ట్టింది.

ఆధార్‌తో స‌హా అన్నివివరాలు యాప్ లో పొందుప‌రుస్తారు.

4 రాష్ట్రాలలోని ఇండ్ల నిర్మాణానికి సంబంధించి వివ‌రాలు సేక‌రించి ముందుకు వెళ్తున్నాం.

ఇండ్ల నిర్మాణంలో ఎటువంటి డిజైన్లు ఉండ‌వు, ల‌బ్దిదారుల ఇష్టం మేర‌కు ఇల్లు నిర్మించుకోవ‌చ్చు. క‌నీసం 400 చ‌ద‌ర‌పు అడుగులు త‌గ్గ‌కుండా ల‌బ్ధిదారుడు ఇల్లు నిర్మించుకోవాలి.

నాలుగు ద‌శల్లో ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణం.

నిర్మాణ ద‌శ‌ల వారీగా ల‌బ్దిదారుల‌కు చెల్లింపులు. పునాదికి ల‌క్ష‌, గోడ‌ల‌కు లక్షా 25వేలు, శ్లాబ్‌కు ల‌క్ష‌న్న‌ర‌, పూర్త‌యితే ల‌క్ష రూపాయిల చొప్పున చెల్లింపు.

బ్యాంకు అకౌంట్ ద్వారానే చెల్లింపులు.

కేంద్రం ఇచ్చే నిధుల‌ను తీసుకొని మిగిలిన మొత్తాన్ని రాష్ట్రం భ‌రిస్తుంది.

నాలుగు సంవ‌త్స‌రాల‌లో 20 లక్ష‌ల ఇండ్లు నిర్మిస్తాం.

ప్ర‌తి నియోజ‌క‌వర్గంలో క‌నీసం 3500 ఇండ్లు నిర్మించేలా చూస్తాం.

ఇండ్ల‌లో త‌ప్ప‌నిస‌రిగా వంట‌గ‌ది, బాత్రూం నిర్మించుకోవాలి.

ప్ర‌తి మండ‌లంలో కనీసం ఒక‌రు లేదా ఇద్ద‌రు ఎఈ లు ఉండేలా చ‌ర్య‌లు.

16 శాఖ‌ల‌కు చెందిన వారిని స‌మీక‌రించి ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణ బాధ్య‌తలు అప్ప‌గిస్తాం.

ఒకే గొడుగు నీడ‌న ఇంజ‌నీర్ల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఇండ్ల నిర్మాణం జ‌రిగేలా చ‌ర్య‌లు.

ప్ర‌భుత్వం త‌ర‌పున 5 ల‌క్ష‌ల సాయం ఇస్తాం, ల‌బ్దిదారులు ఆర్ధిక ప‌రిస్థతి బ‌ట్టి ఇంకా క‌ట్టుకోవ‌చ్చు.

దేశంలో తెలంగాణ మాత్ర‌మే ఇంత‌టి భారీ గృహ నిర్మాణం చేప‌ట్టి, 5 ల‌క్ష‌ల సాయం అందిస్తోంది.

గ‌త ప్ర‌భుత్వంలో నిలిచిపోయిన సుమారు 600-800 ఇండ్ల నిర్మాణానికి కూడా స‌హ‌క‌రిస్తాం.

తొలి విడతగా సుమారు 28 వేల కోట్ల రూపాయిల వ‌ర‌కు కోట్లు ఖ‌ర్చు కావ‌చ్చు.

సుమారు 7,740 కోట్ల రూపాయిల‌ను ఇందిర‌మ్మ ఇండ్లకు బ‌డ్జెట్‌లో కేటాయించాం.

అవ‌స‌ర‌మైన నిధుల కోసం కేంద్రాన్ని కోరుతాం, నిధుల‌ను వివిధ మార్గాల‌ద్వారా స‌మీక‌రిస్తాం.

పునాది పూర్త‌యిన వెంట‌నే తొలివిడ‌త నిధుల విడుద‌ల‌, నిర్మాణాలు జ‌రిగేలోగా మ‌ళ్లీ బ‌డ్జెట్‌లో నిధుల కేటాయింపు జ‌రుగుతుంది.

స్మార్ట్ కార్డుల ఆధారంగా ల‌బ్దిదారుల ఎంపిక‌,

అర్హులైన విక‌లాంగులకు ప్రాధాన్య‌త ఇస్తే మంచిదే. గ్రామ క‌మిటీలదే తుది ఎంపిక.

నంద‌నవ‌నం, మంకాల్ ఇండ్ల స‌మ‌స్య‌కు త్వ‌ర‌లో ప‌రిష్కారం , అధికారుల‌కు ఆదేశాలు.

ఇండ్ల స్ధ‌లాలు లేనివారికి 2 వ‌ద‌శ‌లో స్థలంతో పాటు ఇల్లు నిర్మించి ఇస్తాం.

కేంద్ర‌ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం 75 నుంచి 80 గ‌జాల స్ధ‌లాన్ని స‌మ‌కూర్చి ఇస్తాం.

ఎక్క‌డైనా కొత్త‌గా ఇందిర‌మ్మ కాల‌నీలు ఏర్ప‌డితే క‌రెంట్‌, రోడ్లు, డ్రైనేజ్ త‌దిత‌ర మౌళిక వ‌స‌తుల‌ను ప్ర‌భుత్వమే స‌మ‌కూరుస్తుంది.

గ‌త ప్ర‌భుత్వం మూసివేసిన హౌసింగ్ శాఖ‌ను పున‌రుద్ద‌రించాము.

ఎన్నిక‌ల వ‌ర‌కే రాజ‌కీయాలు, ఎలాంటి భేషజాల‌కు పోవ‌డంలేదు.

కేంద్రం ఎంతిచ్చినా తీసుకుంటాం, ఏమీ ఇవ్వ‌క‌పోయినా ఇందిర‌మ్మ ఇండ్ల‌ను నిర్మిస్తాం, మాకు ఇగోలు లేవు.

గ‌త ప్ర‌భుత్వం ధ‌నిక రాష్ట్రమ‌ని చెప్పి కేంద్రాన్ని ఇండ్లు అడ‌గ‌లేదు.

డబుల్ బెడ్ రూం ఇండ్ల‌లో నీళ్లు, క‌రెంట్ , డ్రైనేజ్ వంటి వ‌స‌తుల్లేవు. మేము అవ‌న్నీ క‌ల్పించి ల‌బ్ధిదారుల‌కు అప్ప‌గిస్తున్నాం.

Comments

Share Your ThoughtsBe the first to write a comment.

​MV NEWS

​allone1news

bottom of page