దావోస్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి
- ABM వార్తలు
- Jan 24
- 1 min read

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. ఆయనకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కాంగ్రెస్ నేతలు, అధికారులు ఘన స్వాగతం పలికారు, మరియు రాష్ట్రానికి రూ.1,789,50 కోట్ల పెట్టుబడులు తేవడంపై పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం దావోస్‌లో 20 ప్రముఖ కంపెనీలతో ఎంవోయూ కుదుర్చుకుంది. మొత్తం రూ.1,78,950 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. ఈ పెట్టుబడుల ద్వారా వేలాది ఉద్యోగాలు సృష్టించబడే అవకాశం ఉంది.
ప్రముఖ కంపెనీలు
అమేజాన్, సన్‌పెట్రో కెమికల్స్, కంట్రోల్ ఎస్, జేఎస్ డబ్ల్యూ, స్కైరూట్ ఏరో స్పేస్, మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫోసిస్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి.
సీఎం కు స్వాగతం పలికిన నేతలు
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మరియు కీలక నేతలు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు.
ఎమ్మెల్యేలు మల్రెడ్డి, దానం నాగేందర్, ఈర్లపల్లి శంకర్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comentarios