పసుపు రైతుల దశాబ్దాల కల:కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- ABM వార్తలు
- Jan 13
- 1 min read

కేంద్రం నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేయడం పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇది రైతుల కోసం ముఖ్యమైన అడుగు అని, ప్రధాని మోదీ ఇచ్చిన హామీని నిలబెట్టుకునారన్నారు. రేపటి నుంచి పసుపు బోర్డు నిజామాబాద్ కేంద్రంగా కార్యాచరణలు ప్రారంభించనుంది. ఈ బోర్డు రైతులకు పసుపు పంటకు సంబంధించిన మద్దతు, మార్కెటింగ్, ఎగుమతి అవకాశాలను పెంచేందుకు దోహదపడుతుంది. ఈ ఏర్పాటు తెలుగు రాష్ట్రాలకే కాకుండా యావద్దేశానికి సంక్రాంతి కానుకగా భావిస్తున్నారు. పసుపు రైతుల దశాబ్దాల కల నెరవేరినట్లయిందని, ఈ బోర్డు ద్వారా రైతులకు నూతన అవకాశాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు.
Comentarios