రిలయన్స్ ఇండస్ట్రీ ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్?
- ABM వార్తలు
- Jan 24
- 1 min read

ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్, గుజరాత్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్‌ను నిర్మించడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో, డేటా సెంటర్ బూమ్‌లో భాగంగా ఏర్పాటు చేయబడుతోంది. డేటా సెంటర్‌ను జామ్ నగర్‌లో నిర్మించనున్నారు.
3 గిగావాట్ల సామర్థ్యం కలిగిన ఈ డేటా సెంటర్, ఎన్ విడియా (Nvidia Corp) సహకారంతో నిర్మించబడుతుంది.
సెమీ కండక్టర్స్‌ను ఎన్ విడియా అందించనుంది.
ఈ డేటా సెంటర్ కోసం ప్రత్యేకంగా సోలార్, విండ్, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నారు.
3 గిగావాట్ల సామర్థ్యం అంటే, నిరంతర కరెంటు సరఫరా అవసరం. ప్రపంచంలో అతి పెద్ద డేటా సెంటర్ నిర్మాణం ద్వారా భారతదేశం ఏఐ మార్కెట్‌లో గట్టి పోటీని అందించగలదు. ఈ ప్రాజెక్టుకు 20 నుంచి 30 బిలియన్ డాలర్ల పెట్టుబడి అవసరం, అయితే ఇప్పటికే 26 బిలియన్ డాలర్లను రిలయన్స్ సిద్ధంగా ఉంచింది. ఈ డేటా సెంటర్ ద్వారా వేల కొలది ఉద్యోగాలు సృష్టించబడతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు
Comments